Conty Chamionship : టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ( Yuzvendra Chahal) కౌంటీల్లో ఆడనున్నాడు. ఈ మేరకు నార్తంప్టన్ షైర్ (Northamptonshire) కౌంటీ యుజీతో వన్డే కప్ మ్యాచ్ మరియు ఐదు కౌంటీ ఛాంపియన్ షిప్ (County Championship) ల మ్యాచ్ ల కోసం ఒప్పందం జరిగింది.
ఈ ఒప్పందం నేపథ్యంలో చహల్ త్వరలోనే యుజీ జట్టుతో చేరతాడని నార్తంప్టన్ హెడ్ కోచ్ జాన్ సాడ్లర్ (Northampton head coach John Sadler) తెలిపారు. అయితే గత సీజన్ లో కూడా కౌంటీల్లో చహల్ ఆడిన సంగతి తెలిసిందే. 2023 సీజన్ లో ఆయన కెంట్ కు ప్రాతినిథ్యం వహించారు. ఈ ఏడాది జూన్ లో జరిగిన టీ20 ప్రపంచ కప్ (T20 World Cup) ను గెలుచుకున్న జట్టులో చహల్ సభ్యుడిగా ఉన్నారు. కానీ ఒక్క ఆట కూడా ఆడలేకపోయారు. అంతేకాదు ఐపీఎల్ లో రెండు వందల వికెట్ల మైలురాయిని అధిగమించిన మొదటి బౌలర్ (First bowler) గా చహల్ నిలిచాడు. కానీ టీమిండియా తరపున సరైన అవకాశాలు రాకపోవడంతో చహల్ కౌంటీల్లో ఆడేందుకు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. కాగా చహల్ తరువాత భారత్ ఆడబోయే బంగ్లాదేశ్ సిరీస్ (Bangladesh Series) కు అందుబాటులో ఉంటారని తెలుస్తోంది. ఈ గ్యాప్ లోనే కౌంటీల్లో ఆడేందుకు ఒప్పందం చేసుకున్నారు.