యావత్ ప్రపంచంలోనే ప్రముఖ ఓటీటీల్లో ఒకటైన నెట్ఫ్లిక్స్ (NexFlix) లోకి మరో భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ రానుంది. ఇటీవల ఓటీటీలోకి వచ్చిన హీరామండి భారత్ లోనే అత్యంత భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ గా నిలిచిందన్న సంగతి తెలిసిందే. తాజాగా ‘ది రాయల్స్ (The Royals)’ పేరుతో కొత్త వెబ్ సిరీస్ రాబోతోంది.
‘ది రాయల్ ’ వెబ్ సిరీస్ లో బాలీవుడ్ ప్రముఖులు (Bollywood Celebraties) నటిస్తుండగా.. వారిని పరిచయం చేస్తూ సదరు ప్లాట్ ఫామ్ టీజర్ ను రిలీజ్ ( Teaser Release) చేసింది. కాగా ఈ సిరీస్ లో భూమి పడ్నేకర్, జీనత్ అమన్, ఇషాన్ ఖట్టర్, చుంకీ పాండే, డీనో మోరియా, మిలింద్ సోమన్ తదితరులు నటిస్తున్నారు. కాగా ఇషాన్ ఖట్టర్, భూమి ఫడ్నేకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సిరీస్ రాజవంశీకుల గ్లామర్ మరియు రొమాన్స్ ను తెరపై ఆవిష్కరించనుందని తెలుస్తోంది. మరోవైపు ఈ టీజర్ ఇంగ్లీష్ లో వచ్చిన ది బ్రిడ్జర్టన్ సిరీస్ (The Bridgerton Series) ను పోలి ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం విశేషం. అయితే ది రాయల్స్ వెబ్ సిరీస్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ (Steaming) కానుందనే విషయాన్ని నెట్ ఫ్లిక్స్ ఇంకా వెల్లడించలేదు.