Punganur Cow: ప్రధాని నివాసంలో పుంగనూరు

పుంగనూరు .  మోదీ వీడియోతో మరోమారు దేశవ్యాప్తంగా గో ప్రేమికుల ఆనందానికి అవధుల్లేకూండా పోయింది . పుంగనూరు.. ఇపుడు దేశవ్యాప్తంగా గో ప్రేమికుల నోట వినిపించే పేరు ఇది .  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో పుంగనూరు లేగ దూడను చూడటం తనకు ఎంతో  ఆనందంగా ఉందని ఆంధ్రప్రదేశ్  మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. మోదీ నామకరణం చేసిన ”దీపజ్యోతి” లేగదూడ ఆంధ్రప్రదేశ్‌లోని తన స్వస్థలం చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిందని లోకేష్ ట్వీట్ చేసారు .    దీపజ్యోతిపై మోదీ పెట్టిన వీడియో సందేశం హృదయాన్ని హత్తుకునేలా ఉందన్నారు. ప్రధానమంత్రి అధికార నివాసంలో కొద్దిగా ఆంధ్రప్రదేశ్‌ని చూడటం తమకు ఎప్పుడూ ఆనందమేనని లోకేశ్‌ తెలిపారు. ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోస్ట్ చేసిన కోడె దూడ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ప్రధాని మోదీ అధికారిక నివాసమైన 7 లోక్ కల్యాణ్ మార్గ్​లో ఓ గోవు లేగ దూడకు జన్మినిచ్చింది. ఆ లేగ దూడకు దీపజ్యోతి (Deepjyoti) అని నామకరణం చేసినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ప్రధాని మోదీ (PM Modi Deepjyoti Video) తెలిపారు. దీపజ్యోతితో కొంత సమయం గడిపానని పేర్కొంటూ ఆ వీడియోను పంచుకున్నారు. ఈ దూడ నుదుటిపై దీపం ఆకారం కనిపించిందని, అందుకే దీపజ్యోతి అనే పేరు పెట్టినట్లు మోదీ వివరించారు.