భారతదేశం ( India) లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మహీంద్రా థార్ రాక్స్ 5- డోర్ ఎస్యూవీ ( Mahindra Thar Roxx) వచ్చేసింది. అదిరిపోయే ఫీచర్లతో ఈ 5 డోర్ ఎస్యూవీ పెట్రోల్ వేరియంట్ ( Petrol variant) ను కేవలం రూ.12.99 లక్షల వద్ద (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసింది. అలాగే డీజిల్ వేరియంట్ ( Diesel variant) ధరలు రూ.13.99 లక్షలు ( ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం కానున్నాయి.
థార్ రాక్స్ బేస్ వేరియంట్ వెలుపలి భాగంలో ఫీచర్లను ప్రకటించింది. డ్యూయల్ టోన్ మెటల్ టాప్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ లు, 18 అంగుళాల స్టీల్ వీల్స్ తో పాటు ఎల్ఈడీ టైల్ లైట్లు (LED tail lights) ఉన్నాయి. అదేవిధంగా లోపల SUV 10.25-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, ఇంజిన్ స్టార్ట్- స్టాప్ బటన్ మరియు వెనుక ఏసీ వెంట్ లు, 60:40 స్ప్లిట్ రియర్ సీట్లు, ఈఎస్సీ, బ్రేక్ లాకింగ్ డిఫరెన్షియల్ తో అందుబాటులోకి వచ్చింది. ప్రధానంగా లైనప్ లో ఆరు ఎయిర్ బ్యాగులు ( Six airbags) అందించబడ్డాయి.
అదేవిధంగా, మహీంద్రా థార్ రోక్స్ లోని ఎంట్రీ లెవల్ ఆఫర్ రెండు ఇంజన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. 2.0 లీటర్, 160 బీహెచ్పీ మరియు 330 ఎన్ఎం అభివృద్ధి చేసే ఎంస్టాలియన్ టర్బో పెట్రోల్ ఇంజన్ (Enstalion Turbo Petrol Engine) , 1530 బీహెచ్పీ మరియు 3330 బీహెచ్పీ ఉత్పత్తి చేసే 2.2 లీటర్, ఎంహాక్ డీజిల్ ఇంజన్ (Emhawk diesel engine) . ఈ క్రమంలో కస్టమర్లు ఆరు స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ల నుంచి ఎంచుకోవచ్చు. కాగా ఈ వెర్షన్ లు 4×2 రూపంలో అందుబాటులో ఉన్నాయి.