AP Deputy CM Pawan Kalyan :కాకినాడ (Kakinada)లో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుక (Independence Day Celebrations) ల్లో ఏపీ డిప్యూటీ సీఎం ( Deputy CM) పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ మేరకు కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఆయన జాతీయ జెండా (National flag) ను ఎగురవేశారు.
అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ గతంలోని వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత ప్రభుత్వం (Previous Government) లో ఎటు చూసినా అరాచకాలేనని విమర్శించారు. కోట్ల మంది బలిదానాలను ఈ రోజు మనం గుర్తు చేసుకోవాలన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత (High priority) ఇస్తుందని తెలిపారు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే మహిళలపై దాడులు, అఘాయిత్యాలను సహించేది లేదని స్పష్టం చేశారు.