Pawan Kalyan: 14 నుంచి పల్లె పండుగ వారోత్సవాలు: డిప్యూటి సీఎం పవన్

ఈ నెల 14 నుంచి గ్రామాల్లో అభివృద్ధి పనులు శరవేగంగా మొదలుపెట్టాలని డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. గ్రామాల్లో పల్లె పండుగ కార్యక్రమం నిర్వహించి పనులు మొదలుపెట్టాలన్నారు. ఆగస్టు 23న రాష్ట్రవ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో నిర్వహించిన గ్రామసభల్లో ఆమోదించిన పనులను  ప్రారంభించాలన్నారు.

రాష్ట్ర సచివాలయం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులు, జిల్లా పరిషత్ అధికారులు, ముఖ్య కార్య నిర్వహణ అధికారులు, డీపీఓలు, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ఇతర జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పల్లె పండుగ వారం రోజులపాటు నిర్వహిస్తున్నామని చెప్పారు. రూ.4500 కోట్ల వ్యయంతో, 30 వేల పనులను మొదలుపెట్టేందుకు ఈ పల్లె పండుగ కార్యక్రమాన్ని రూపొందించామని వివరించారు.

మూడువేల కిలో మీటర్ల మేర సీసీ రోడ్లు, 500 కిలోమీటర్ల తారు రోడ్లు, వ్యవసాయ కుంటలు, పశువుల శాలలు, ఇంకుడు గుంతల నిర్మాణాలు  చేపట్టాలని,  ఈ పనులతో పాటు ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులను సంక్రాంతిలోగా పూర్తిచేసి మళ్లీ సంబరాలు చేసుకోవాలన్నారు. పనుల వివరాలు ప్రజలందరికీ తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ పల్లె పండుగ కార్యక్రమాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు