టీడీపీ -16, జనసేన -3, బీజేపీ -1 చొప్పున మొత్తం 20 నామినేటెడ్ పోస్టుల భర్తీ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది . తొలివిడత పదవులలో సామాన్య కార్యకర్తలకు పెద్ద పీట వేసింది. 99 మందితో తొలి నామినేటెడ్ పదవుల జాబితాను మంగళవారం ప్రకటించింది. అందులో బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీలకు పెద్ద పీట వేసింది. 11 మంది క్లస్టర్ ఇంఛార్జ్‌లకు పదవులు కేటాయించింది.ఒక క్లస్టర్ ఇంఛార్జీను చైర్మన్ పదవిలో నియమించింది. అలాగే ఆరుగురు యూనిట్ ఇంఛార్జ్‌లకు పదవులు కేటాయించింది. 20 కార్పొరేషన్లకు చైర్మన్లు, ఒక కార్పొరేషన్‌కు వైస్ చైర్మన్‌తోపాటు వివిధ కార్పొరేషన్లకు సభ్యులను సైతం కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ప్రకటించిన నామినేటేడ్ పోస్టుల్లో 99 శాతం పదవులు యువతకే ప్రాధాన్యత ఇచ్చారు . పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు సీఎం చంద్రబాబు ఈ పదవులు కేటాయించారు.