బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివి . . ఐదేళ్లపాటు హైదరాబాద్ లో జాబ్ చేసి వదిలిపెట్టి వచ్చాడాయువకుడు . ఉద్యోగం వదిలేసి వస్తుంటే ఆ యువకుడిని వారించారు అందరూ . కానీ పాలేకర్ విధానంలో ప్రకృతి వ్యవసాయ పద్దతిలో సాగు చేస్తూ ఎకరానికి 2 లక్షల ఆదాయం ఆర్జిస్తున్నారు .
ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం వెల్లమిల్లి గ్రామానికి చెందిన యువ రైతు రాజేంద్ర ప్రసాద్.. ప్రకృతి వ్యవసాయంలో వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. 8 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్న ఈ రైతు… అందులోని ఒక ఎకరాన్ని మాత్రం విభిన్నంగా తీర్చిదిద్దారు. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ – IFS (Intergrated Farming system) మోడల్ లో పంటలు, చేపలు, పండ్లు, కూరగాయలు ఎకకాలంలో పెంచుతూ, పండిస్తూ.. లాభాలు ఆర్జిస్తున్నారు. ఆ విధానాన్ని యువ రైతు రాజేంద్ర ప్రసాద్ ఇలా వివరించారు.
ఒక ఎకరాన్ని మోడల్ గా తీసుకుని . . అందులో వరి (అర ఎకరం ) , చేపలు (30 సెంట్లు ) , చుట్టూ గట్లపై పండ్ల చెట్లు పెట్టడం వల్ల ఇందులో సక్సెస్ అయి . .. ఏటా 2 లక్షల ఆదాయం వరకు వస్తుంది . . అని రైతు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు .