వినాయక చవితి . . ఈ పేరు చెపితేనే హైదరాబాద్ లో అత్యంత పెద్ద పండగ . వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్లో గణపతి నిమజ్జనానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు . ఈ వివరాలను హైదరాబాద్ నగర సీపీ సీవీ ఆనంద్ (ఐపిఎస్) తెలిపారు. అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. దీని కోసం 25వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేసమన్నారు . గణేశ్ పండగ సందర్భంగా నగరవ్యాప్తంగా భారీఎత్తున పందిళ్లు , విగ్రహాలు ఏర్పాటు చేశారు. చిన్నపెద్ద విగ్రహాలు కలిపి మెుత్తం 80 వేల నుంచి లక్ష వరకు ఉంటాయి . గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఘర్షణలు, ప్రాణనష్టం, ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు నగర సీపీ సీవీ ఆనంద్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు . . సిటీ నుంచి 15వేల మంది సిబ్బంది, బయట నుంచి మరో 10వేల ఫోర్స్ రంగంలోకి దిగి భద్రతను పర్యవేక్షిస్తారని ఆయన చెప్పారు. సెప్టెంబర్ 16, 17తేదీల్లో పెద్దఎత్తున నిమజ్జనాలు ఉండడంతో.. ఈ రెండు తేదీల్లో సుమారు 40గంటలపాటు 25వేల మంది పోలీసులు నగరాన్ని పహారా కాస్తారని వెల్లడించారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని సీపీ ఆనంద్ ఈ సందర్భగా కోరారు.