”చెట్టు కింద కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు . ఇది వాళ్లకి రెగ్యులర్ . కానీ ఆ రోజే అది చివరి రోజు అని మాత్రం గ్రహించలేకపోయారు . పిడుగుపాటుకు చెట్టుకుంద కూర్చుని మాటల్లో ఉన్న ఏడుగురు క్షణాలలో చనిపోయారు . .”
ఛత్తీస్‌గఢ్‌లోని బలోదాబాజార్ భటపరా జిల్లాలో విషాదం నెలకొంది. మొహతారా గ్రామంలో పిడుగుపాటుకు గురై ఏడుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను అధికారులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. గ్రామంలో పొలంలో పనులు చేస్తున్న సమయంలో ఉరుముల మెరుపులతో కూడిన వర్షం పడింది. ఆ సమయంలో కొంతమంది పొలం సమీపంలో ఉన్న చెట్టుకిందికి వచ్చి మాట్లాడుకుంటున్నారు. అకస్మాత్తుగా చెట్టుపై పిడుగు పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెంతారు. మృతులను సురేష్ సాహు, సంతోష్ సాహు, పప్పు సాహు, పోఖారం విశ్వకర్మ, థానేశ్వర్ సాహు, దేవదాస్, విజయ్ సాహులుగా అధికారులు గుర్తించారు. చేతన్ సాహు, బిందారం సాహు, బిసంభర్ సాహు గాయపడ్డారు .