” యద్భావం తద్బవతి . . మనం ఏది భావిస్తామో . . అదే జరుగుతుంది . అంటే మనం మంచి గురించే రెగ్యులర్ గ ఆలోచిస్తూ ఉంటె మంచే జరుగుతుంది . . చేదు జ్ఞాపకాలు చెరిపేసుకోవాలి . సానుకూల ఆలోచనలకూ ప్రాధ్యానత ఇవ్వాలి . నామస్మరణతో పాతవన్నీ పోతుంటాయి . .
కొన్ని పాటిస్తే . ..
ప్రతిరోజూ కనీసం ఒక్క ఇరవై నిముషాలు
కనులు మూసుకొని ధ్యానంలో గడపండి.
ఈ ధ్యానం మనల్ని మనకి పరిచయం చేస్తుంది.
కళ్లు తెరిచి చూస్తే..
చుట్టూ శత్రువులు, సమస్యలు, ప్రతిబంధకాలు ఎన్నో కనిపిస్తాయి!
కళ్ళు మూసినప్పుడు కూడా అవే కనిపించకూడదు!
కనులు మూసుకొని ఇవీ ఆలోచించాల్సింది..
జీవితంలో మనకి ప్రతి దశలోనూ
ప్రత్యక్షంగా రాలేదా పరోక్షంగా ఎందరో చేసిన సహాయాల్ని గుర్తు చేసుకోవాలి.
సాయం అంటే దానం మాత్రమే కాదు.. మన గురించి
పాజిటివ్ గా అవతలివాళ్ళు ఆలోచించడం కూడా గొప్ప సహాయమే!
మనకి ఎన్నో సమస్యలు ఉండొచ్చు..
కానీ ఈ క్షణం ఎలా గడుస్తుందా అనే కష్టాల్లో లేము .. అదీ దైవానుగ్రహమే.
మన చుట్టూ ప్రపంచంలో
అలాంటి దారుణ యాతనల్ని అనుభవిస్తున్నవారిని
ఒక్కసారి గుర్తు చేసుకుంటే…
మనం ఎంత కంఫర్టబుల్ జోన్ లో ఉన్నామో అర్థం అవుతుంది,
మిగిలిన వాళ్లతో పోలిస్తే . .మనం ఇలా ఉన్నందుకు ఆ పైవాడికి
ప్రతి నిత్యం ధన్యవాదాలు చెప్పుకోవాలి..
ఇతరుల కష్టాన్ని తొలగించమని కోరుకోవాలి!
మనం ఇతరులనుంచి ఏదో రూపంలో ఒక సహాయం పొందినప్పుడు ..
తగిన విధంగా ఏదో ఒక ప్రత్యుపకారం చేయాలి.
అలా ఇవాళ మనం చేస్తే రేపు మరొకరినుంచి సహాయం అందుతుంది.
లేదంటే మన తలుపులు మనమే మూసేసుకున్నట్లే.
శత్రుభయం, శత్రుభావం..
ఈ రెండూ మనసుని కృశింపజేస్తూ ఉంటాయి.
అవి మెదడుని తొలిచేస్తూ ఉంటాయి!
మనకి హాని చేసినవాళ్ళని,
చేసారని మనం భావించిన వారిని గుర్తు చేసుకోండి..
భౌతికంగా క్షమించలేకపోయినా..
ఈ ధ్యానంలో గుర్తు చేసుకొని వారిని మనస్ఫూర్తిగా క్షమించండి.
వారి పట్ల వీలైనంత పాజిటివ్ గా ఆలోచించండి.
మనసులో పెద్ద భారం దిగిపోతుంది.
అంతే కాదు కొన్నాళ్ళకి ఈ వైరభావం కూడా తొలగిపోయే పరిస్థితి వస్తుంది.. యద్భావం తద్భవతి కదా!
మనం ఎవరికైనా హాని, అన్యాయం చేశామా?
ఆలోచించుకోండి నిజాయితీగా!
అలాంటివారికి హృదయపూర్వకంగా ధ్యానంలోనే క్షమాపణ చెప్పండి.
వారిపట్ల నెగెటివ్ భావజాలాన్ని వదిలేయండి. వారికీ మంచి జరగాలని కోరుకోండి.
గొప్ప రహస్యం చెబుతాను.. మనసులో పెట్టుకోండి…
మనకి మంచి జరగాలని భక్తితో కోరుకుంటే..
దైవం నూటికి 50 శాతం అనుగ్రహిస్తాడు..
ఇతరులకి మంచి జరగాలని.. అందునా శత్రువుకి కూడా మంచి జరగాలని
మనం కోరుకుంటే.. దైవం నూటికి నూరుశాతం అనుగ్రహిస్తాడు..
ఆ అనుగ్రహం మననుంచే మొదలవుతుంది.
అందరికంటే మనం బాగుంటాం!!
బాగున్న అందరితో మనం కలసి ఉంటాం!
చుట్టూ ఆనందం ఉండాలని కోరుకోవాలి తప్ప..
విషాదం నిండిన లోకంలో మనం ఆనందంగా ఉండాలని కోరుకోరాదు.
చుట్టూ పూరి గుడిసెలు కాలిపోతుంటే మధ్యలో దాబా ఇల్లు ఎలా బాగుంటుంది?
ఎన్ని అంతస్తుల ఎత్తులో మనం ఉన్నా..
వరదతో మునిగిపోయిన ఊళ్ళో సుఖం ఎలా లభిస్తుంది?
అంతా బాగుండాలి.. అందరూ బాగుండాలి అని కోరుకోండి..
అందరూ అన్నప్పుడు అందరిలో మీరెలాగూ ఉన్నారు..
మీకోసం ప్రత్యేకంగా అడగనక్కర్లేదు!
అన్నీ వాటంతట అవి మీకూ వస్తాయి!
అందరికంటే మీకే ఎక్కువ వస్తాయి.. ఎందుకంటారా?
తనకోసం తాను ఏదీ కోరుకోనివాడు మహాత్ముడు!
అలాంటివాడు పరమేశ్వరునికి అత్యంత ఇష్టుడు!