బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ వ్యాఖ్యలపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Director Nag Ashwin) స్పందించారు. కల్కి సినిమా (Kalki Movie) లో ఓ సన్నివేశాన్ని పోస్ట్ చేసిన నెటిజన్ ఈ ఒక్క సీన్ బాలీవుడ్ పరిశ్రమ (Bollywood Industry) మొత్తంతో సమానం అని క్యాప్షన్ పెట్టారు. ఈ పోస్ట్ పై స్పందించిన నాగ్ అశ్విన్.. టాలీవుడ్, బాలీవుడ్ అని విడదీసి మాట్లాడొద్దని సూచించారు.
‘ నార్త్ – సౌత్, టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ (Tollywood Vs Bollywood).. ఇలా కంపేర్ చేస్తూ వెనక్కి వెళ్లొద్దని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అన్నారు. మనమంతా ఒక ఇండస్ట్రీకి చెందిన వాళ్లమని పేర్కొన్నారు. అర్షద్ (Arshas Varsi) కొంచెం హుందాగా మాట్లాడాల్సిందని చెప్పారు. అయినా ఫర్వాలేదన్న ఆయన అర్షద్ పిల్లల కోసం కల్కి బుజ్జి బొమ్మలు పంపిస్తామని తెలిపారు. అంతేకాకుండా కల్కి రెండో భాగం (Second Part) కోసం మరింత కష్టపడతానని, అందులో ప్రభాస్ ను ది బెస్ట్ (The Best) గా చూపిస్తానని వెల్లడించారు. ప్రపంచంలో చాలామంది ద్వేషిస్తారు.. అయితే వాటిని పక్కన పెట్టి ముందుకెళ్లాలన్నారు. ప్రభాస్ కూడా ఇదే విషయాన్ని చెబుతుంటారని నాగ్ అశ్విన్ తెలిపారు.
అయితే ప్రభాస్ ను ఉద్దేశించి నటుడు అర్హద్ వార్సీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. కల్కి 2898 ఏడీ సినిమాలో ప్రభాస్ గెటప్ జోకర్ ను తలిపించిందంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు.