ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) రూర్కీ గేట్ (GATE) పరీక్ష -2025 కోసం ఇవాళ్టి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించనుంది. ఈ మేరకు ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు(Engineering graduates) https://gate2025.iitr.ac.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.
గ్రాడ్యుయేట్ ఆఫ్టిట్యూట్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) 2025కు వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 1, 2 మరియు 15, 16వ తేదీల్లో పరీక్ష జరగనుంది. ఈ టెస్ట్ ఇంజనీరింగ్, టెక్నాలజీ మరియు ఆర్కిటెక్చర్ తో పాటు మరి కొన్నింటిలో అండర్ గ్రాడ్యుయేట్ సబ్జెక్టుల( Undergraduate Subjects) పై ఆధారపడి ఉంటుంది. గేట్ కోసం ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా బ్యాచిలర్ డిగ్రీ ప్రొగ్రాంలో చివరి సంవత్సరం చదువుతున్న వారు అర్హులు. అదేవిధంగా సైన్స్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు (Candidates) లేదా పూర్తి చేసిన వారు అర్హులు.
* గేట్ 2025 (GATE 2025) రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: ఆగస్ట్ 24, 2024
* పరీక్ష తేదీలు: ఫిబ్రవరి 1, 2, 15, 16
* రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ : సెప్టెంబర్ 26, 2024
* ఆలస్యమైన నమోదు గడువు: అక్టోబర్ 7, 2024
* ఫలితాలు విడుదల తేదీ : మార్చి 19, 2025.