ఏపీ (AP State) లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వ (Previous Government) పథకాల పేర్లను మారుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరో ఆరు పథకాల పేర్ల( Six Schemes Names)ను మార్చింది.
పాఠశాల విద్యాశాఖ (School Education Department) అమలు చేస్తున్న ఆరు పథకాల పేర్లను మారుస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం..
పాఠశాలల్లో నాడు -నేడు కార్యక్రమం ‘ మన బడి – మన భవిష్యత్ ’గా మార్చబడింది. అమ్మఒడి పథకం పేరు తల్లికి వందనం (Thalliki Vandhanam) , గోరుముద్ద పథకం పేరు ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా, జగనన్న ఆణిముత్యాలు పథకానికి అబ్దుల్ కలామ్ ప్రతిభా పురస్కారంగా మార్చుతూ ఉత్తర్వుల్లో పేర్కొంది. అదేవిధంగా స్వేచ్ఛ పథకాన్ని బాలికా రక్షగానూ, విద్యాకానుక పథకాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ మిత్రగా మార్చింది.