జన్వాడ ఫాంహౌస్ (Janwada Farmhouse) కూల్చోద్దంటూ తెలంగాణ హైకోర్టు (Telagnana High Court) లో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు బీఆర్ఎస్ నాయకుడు ప్రదీప్ రెడ్డి (Pradeep Reddy) న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు హైడ్రా కమిషనర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మరియు లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు, శంకర్ పల్లి తహసీల్దార్, చీఫ్ ఇంజనీర్ ను చేర్చారు.
అదేవిధంగా హైడ్రా కూల్చివేతల (Hydra demolitions) పై స్టే ఇవ్వాలని ప్రదీప్ రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ (Justice Laxman Bench) హైడ్రాకు ఉన్న పరిమితులు, అధికారాలను తెలపాలని ఆదేశాలు జారీ చేసింది. అనంతరం పిటిషన్ ను మధ్యాహ్నం 2.30 గంటలకు మరోసారి విచారిస్తామని తెలిపింది.