కోల్కతా(Kolkata) లోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ (RG Kar Medical College) లో చోటు చేసుకున్న ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై సీబీఐ అధికారుల (CBI Officials) దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.
ఇందులో భాగంగా ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపాల్ ను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే డాక్టర్ సందీప్ ఘోష్ కు పాలిగ్రాఫ్ టెస్ట్ (Polygraph test) చేయాలని సీబీఐ యోచిస్తోంది. విచారణ సమయంలో పొంతనలేని సమాధానాలు చెప్తున్నట్లు సీబీఐ తెలిపింది. మరోవైపు ఆర్జీ కర్ ఆస్పత్రి విధ్వంసం సమయంలో విధుల్లో ఉన్న ఇద్దు ఏసీపీలు, ఇన్ స్పెక్టర్లపై బెంగాల్ ప్రభుత్వం (Bengal Government) వేటు వేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా ఆస్పత్రిపై విధ్వంసం సృష్టించిన సుమారు 40 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పై అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన భారీగా అవినీతికి పాల్పడటమే కాకుండా పరీక్షలు తప్పిన విద్యార్థుల నుంచి కూడా భారీగా నగదు దండుకొనేవాడని ఆరోపణలు వస్తున్నాయి.