Pension: ఏపీలో ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం (coalition government) మరో కీలక నిర్ణయం (Key Decision) తీసుకోనుందని తెలుస్తోంది. రాష్ట్రంలో బోగస్ సర్టిఫికెట్ల(Bogus certificates)తో పెన్షన్ తీసుకుంటున్న లబ్ధిదారులను గుర్తించి వారికి పెన్షన్ ను కట్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 67 లక్షల మంది వివిధ కేటగిరీల్లో పెన్షన్లు తీసుకుంటున్నారు. ఇక దివ్యాంగుల కోట కింద సుమారు ఎనిమిది లక్షల మంది పెన్షన్ తీసుకుంటున్నారు. అయితే వీరిలో చాలా మంది ఫేక్ సర్టిఫికెట్లను పెట్టి పెన్షన్ పొందుతున్నట్లుగా గుర్తించిన అధికారులు నోటీసులు సైతం జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వారందరికీ పెన్షన్ల పంపిణీని నిలిపివేయనున్నారని తెలుస్తోంది. అదేవిధంగా ఎవరైనా నకిలీ సర్టిఫికెట్లతో పెన్షన్ కు దరఖాస్తు (Apply) చేసుకుంటే కనుక ఆ అప్లికేషన్స్ ను పక్కన పెట్టాలని ప్రభుత్వం (Government) అధికారులు కీలక ఆదేశాలు జారీ (Issed Orders) చేసిందని సమాచారం.