Wayanad Landslide Victims: కేరళలోని వయనాడ్ (Wayanad)లో ఇటీవల కొండ చరియలు విరిగిపడిన నేపథ్యంలో అక్కడి పర్యాటక శాఖ (Tourism Department )కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలో నిర్వహించాల్సిన ఓనం (Onam ) వారోత్సవాలను రద్దు చేసింది.
కాగా వయనాడ్ ఘటనలో దాదాపు నాలుగు వందల మందికి పైగా మృతి చెందారని రాష్ట్ర పర్యాటక శాఖ తెలిపిందని సమాచారం. కొండ చరియలు విరిగి పడటంతో సుమారు 729 కుటుంబాలు దెబ్బతినగా.. వీరిలో 219 కుటుంబాలు సహాయక శిబిరాల్లో ఉన్నారు.. సాధారణంగా కేరళ రాజధాని తిరువనంతపురం( Thiruvanthapuram)లో ఓనం వేడుకలను ప్రభుత్వం వారం రోజులపాటు నిర్వహిస్తుందన్న సంగతి తెలిసిందే. ఇదే కాకుండా జిల్లా స్థాయి మరియు ప్రభుత్వ కార్యాలయాల స్థాయిలో వేడుకలు(Celebrations) నిర్వహించబడతాయి. అయితే ప్రస్తుతం ఈ వారోత్సవాలను సర్కార్ రద్దు చేసింది. ఓనం వారోత్సవాలతో పాటు పర్యాటక శాఖ నిర్వహించ తలపెట్టిన ఛాంపియన్స్ బోట్ లీగ్ (Champions Boat League) రేసులను రద్దు చేసినట్లు ప్రకటించింది.
మరోవైపు వయనాడ్ విపత్తు బాధితుల రుణాలను మాఫీ చేసేందుకు బ్యాంకులు(All Banks) సిద్ధంగా ఉండాలని సీఎం పినరయి విజయన్ (CM Pinarayi Vijayan) సూచించారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన బ్యాంకులు స్వతంత్రంగా మద్ధతు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా బాధితుల రుణాలను మాఫీ చేసిన కేరళ బ్యాంక్ (Kerala Bank) అనుసరించిన విధానం ఆదర్శప్రాయమైనదని తెలిపారు.