కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ ( Thalapathy Vijay) నటించిన చిత్రం ‘ది గోట్’ – ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ప్రముఖ దర్శకులు వెంకట్ ప్రభు ( Director Venkat Prabhu) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో దివంగత నటుడు కెప్టెన్ విజయ్ కాంత్ ( Late Actor Vijaykanth) ను చూపించబోతున్నారని తెలుస్తోంది.
త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ది గోట్ మూవీ టీమ్ కెప్టెన్ విజయ్ కాంత్ నివాసానికి వెళ్లారు. అక్కడ ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం విజయ్ కాంత్ సతీమణి ప్రేమలత (Vijaykanth’s wife Premelatha)తో కాసేపు మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే ఆయన కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా (Social Media) వేదికగా పంచుకున్నారు. కాగా విజయ్ రెండు పాత్రల్లో కనిపించబోతున్న ఈ మూవీలో డీ -ఏజింగ్ టెక్నాలజీని వినియోగించారు. అయితే సెప్టెంబర్ 5వ తేదీన సినిమా విడుదల (Movie Release) కు సిద్ధమైంది.