హీరో పవన్ కల్యాణ్ హాష్ ట్యాగ్ (Pawan Kalyan Hashtag) వైరల్ గా మారింది. ఆయన సినిమాలకు సంబంధించిన కొన్ని వార్తలు షేర్ కావడం, బాలీవుడ్ నటుడు ఆయనపై ప్రశంసలు కురిపించడమే దీనికి కారణం. పవన్ కల్యాణ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. సినీ ప్రముఖులు కూడా ఆయనకు వీరాభిమానులే. పలు సందర్భాల్లో వారంతా పవన్ పై ఉన్న అభిమానాన్ని వెల్లడించారు. తాజాగా ‘మీర్జాపూర్’ నటుడు పంకజ్ త్రిపాఠి (Meerzapur – Pankaj Tripathi) పవన్ పై ప్రశంసలు కురిపించారు. ఓ ఇంటర్వ్యూలో పవన్ ను ఉద్దేశించి పంకజ్ మాట్లాడుతూ.. ‘పవన్ గొప్ప నటుడు. పుస్తకాలు బాగా చదువుతారు. ఎంతో దూరదృష్టి ఉన్న వ్యక్తి .. ఈ విషయాన్ని నాకు కొందరు డైరెక్టర్లు కూడా చెప్పారు. ఆయనకు అన్ని భాషల్లో అభిమానులు ఉన్నారు’ అని చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరోవైపు పవన్ కల్యాణ్ సినిమాలకు సంబంధించిన మరో రెండు వార్తలు ‘x’ లో షేర్ అవుతున్నాయి. పవన్ కల్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఓజీ ‘ (OG). ఈ సినిమాలో ఓ తమిళ హీరో పాట పాడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ కెరీర్లోనే అది బిగ్గెస్ట్ ఎలివేషన్ సాంగ్ అని టాక్. అలాగే ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veeramallu) సినిమాలో పవన్ కల్యాణ్ ఓ పాట పాడనున్నారట. వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.