Jr. NTR, Kalyan Ram: ఇంతకీ జూ.ఎన్టీఆర్ చెప్తున్న హరి ఎవరు..?

హైదరాబాద్: మ్యాన్ ఆఫ్ మాసెస్‌ జూ.ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 500 కోట్ల మార్క్‌ వైపు జెట్ స్పీడ్లో దూసుకుపోతోంది (Man of Masses Jr. NTR). దీంతో ఈ మూవీ మేకర్స్ రీసెంట్‌ గా సక్సెస్ పార్టీని ఏర్పాటు చేశారు. అయితే ఈ ఈ పార్టీలో మాట్లాడిన యంగ్ టైగర్ … తన స్పీచ్‌ చివర్లో హరి (Hari) గురించి ప్రస్తావించారు. ఎమోషనల్ కామెంట్స్ చేశారు. దీంతో అసలు హరి ఎవరు? ఎన్టీఆర్‌కు ఈయనకు సంబంధం ఏంటనే ప్రశ్న నెట్టింట వస్తోంది. హరి గురించి తారక్ ఫ్యాన్స్ ఆరా తీయడం ఎక్కువైంది. ఇక ఈ హరి ఎవరో కాదు.. ఎన్టీఆర్‌కు వరుసకు బామ్మర్ది అవుతాడు. తారక్ అన్న కల్యాణ్ రామ్ భార్య తమ్ముడే.. హరి! ఎప్పటి నుంచో కల్యాణ్ రామ్, హరి కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు(Kalyan Ram). అంతేకాదు కళ్యాణ్ సినిమా స్టోరీలను కూడా హరే ఫైనల్ చేస్తుంటారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్‌ సినిమా సంబంధించిన విషయాలను కూడా ఈయనే చూసుకుంటున్నట్టు తెలుస్తోంది.