తిరుపతి శ్రీవారు లడ్డూ వివాదం మొదలైనప్పటి నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీడియాలో సంచలనంగా మారారు. ఇటీవల తిరుపతిలో వారాహి డిక్లరేషన్ బహిరంగ సభలో సనాతన ధర్మం కోసం చేసిన వ్యాఖ్యలు మరింత మంట పుట్టించాయి. లడ్డూ వివాదం మొదలైనప్పటి నుంచి పనన్ కల్యాణ్ ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మధ్య ట్వీట్ ల యుద్ధం సాగుతున్న వ్యవహారం తెలిసిందే.
పవన్ కల్యాణ్ తాజాగా ఎంజీఆర్, అన్నాడీఎంకే గురించి ట్వీట్ చేయగా ఎంజీఆర్ పై హఠాత్తుగా ఎందుకింత ప్రేమో, పైనుంచి ఆదేశాలు అందాయా అంటూ ప్రకాశ్ రాజ్ వ్యగంగా ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్ మరోసారి ఎంజీఆర్ గురించి ట్వీట్ చేశారు.
ఎంజీ ఆర్ నుంచి పాఠాలు నేర్చుకున్నానని పవన్ వెల్లడించారు. గతంలో ఎంజీఆర్ గురించి చేసిన కామెంట్లకు సంబంధించిన వీడియోలను ట్వీట్ కు లింక్ చేశారు. ఎంజీఆర్ పై హఠాత్తుగా ఎందుకింత ప్రేమ పుట్టుకొచ్చిందో అని ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గానే పవన్ తాజా ట్వీట్ చేసినట్టు నెటిజన్లు భావిస్తున్నారు.