RK Roja: బావ కళ్ళలో కాదు.. భక్తుల కళ్ళలో ఆనందం చూడమ్మా..!

తిరుపతి : తిరుమల లడ్డూ వివాదం పై అధికార,ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.  ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి వ్యాఖ్యలపై  హాట్ కామెంట్లు చేశారు మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా.

తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. సీయం ఏమైనా మాట్లాడవచ్చన్న పురంధేశ్వరి (AP BJP Chief Purandheswari) వ్యాఖ్యలు సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు. బావ కళ్ళలో ఆనందం కోసం కాకుండా.. భక్తుల కళ్ళలో ఆనందం కోసం పని చేయాలి అంటూ సలహా ఇచ్చారు. తిరుమల లడ్డూ  కు పరీక్షలు చేయలేదని సుప్రీంకోర్టు (Suprem Court) లో కూటమి లాయరే అంగీకరించారన్న ఆమె.. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్  ప్రెస్ మీట్ లో మాట్లాడే మాటలు కోర్టులో ఎందుకు మాట్లాడటం లేదు..?అని నిలదీశారు. మీరు బీజేపీ అధ్యక్షురాలా? లేక టీడీపీ(TDP) అధ్యక్షురాలో అర్థం కావట్లేదని ఎద్దేవా చేశారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను తప్పుదోవ పట్టిస్తున్నారు. .. లడ్డూలో కల్తీ నెయ్యి ఘటనపై విచారణ చేపట్టకుండానే సీయం విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు.  భిన్నమైన ప్రకటనలు  చేసిన టీటీడీ ఈవో శ్యామలరావు (TTD EO Shyamala Rao) ను కూడా విచారించాలని రోజా (RK Roja) డిమాండ్ చేశారు.