NETANYAHU: టైమ్, ప్లేస్ డిసైడ్ చేస్తాం.. దాడిచేసి తప్పుచేశారు: ఇరాన్‌కు వార్నింగ్

ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం కొత్త మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇజ్రాయెల్ లెబనాన్ పై దాడులు ప్రారంభించింది. అయితే కొన్ని గంటల్లోనే టెల్ అవీవ్, జెరూసలేంపై ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. దీంతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) తీవ్రంగా స్పందించారు.

ఇరాన్ టెల్ అవీవ్, జెరూసలెం లక్ష్యంగా  ప్రయోగించిన క్షిపణుల్లో చాలావాటిని అమెరికా సహకారంతో ఇజ్రాయేల్‌ అడ్డుకుంది. ఐరన్ డోమ్‌ సహాయంతో వాటిని మధ్యలోనే కూల్చివేసింది. ఈ దాడిపై ఇజ్రాయేల్ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు (Benjamin Netanyahu) రియాక్ట్ అయ్యారు. ఇరాన్‌ భారీ తప్పిదం చేసిందని,  తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అందుకు సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు.

తమకు అండగా నిలిచిన అమెరికాకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇరాన్‌కు తగిన గుణపాఠం చెబుతామని అందుకు తగిన సమయం, ప్రదేశాన్ని ఫిక్స్ చేస్తామని ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్స్ అధికార ప్రతినిధి అడ్మిరల్ డానియల్ హగేరీ శపథం చేశారు.