”Both of them are leaving moral values”
”ఐదేళ్ల పాటు అరాచకాలతో జనసేన , టీడీపీ కార్యకర్తలను హింసలకు గురిచేసి కొన్ని చోట్ల ఆయా పార్టీల కార్యకర్తలపై హత్యలకు పాల్పడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలకు రక్షణ కల్పించేందుకు జనసేన , టీడీపీ నేతలు బేరసారాలు పెట్టుకుంటున్నారు . ఇన్నాళ్లూ ప్రాణాలు ఫణంగా పెట్టి ఎవరితో అయితే పోరాటం చేసామో . .వాళ్ళే మళ్ళీ మమ్మల్ని కట్టడి చేసేందుకు మా పార్టీలలో చేరుతున్నారు . జనం ఎన్నికల్లో చేకొట్టిన విష బీజాలను జనసేన , టీడీపీలలో పెట్టుకుని . . మన పార్టీలను విష తుల్యం చేసుకోవడం కరెక్ట్ కాదు . . ఇదే విషయం పవన్ , చంద్రబాబులకు మొత్తుకుంటున్నా వాళ్ళు మా మొర ఆలకించడంలేదు . . మేము ఎవరికి చెప్పుకోవాలో తెలియడంలేదు . మా మానసిక వేదనను నిర్లక్ష్యం చేస్తే అందుకు దేవుడే తగిన మూల్యం చెల్లిస్తాడు . . ” అంటూ శాపనార్థాలు పెడుతున్నారు .
ఇదీ ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాలలో జనసేన , టీడీపీ కేడర్ లో పెల్లుబుకుతున్న ఆవేదన . ఐదేళ్లూ వైసీపీ నేతల అరాచకాలను భరించి… అధికారంలోకి రావడానికి శాయశక్తులా పనిచేసిన అసలు , సిసలు కార్యకర్తలు , నేతలు ఆయా పార్టీలలో ప్రాధ్యాన్యత కోల్పోతున్నారు . ఈ రాజకీయ దుస్థితికి కారణం ముమ్మాటికీ ఇరు పార్టీల అధ్యక్షులు చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్ . . అంటూ తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు కేడర్ .
వంద రోజులలో ముఖ్యమంత్రి చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సుపరిపాలన అందించారు . వైసీపీ అరాచక పాలనలో అస్తవ్యస్తమైన పాలనా వ్య్వవస్థను గాడిన పెట్టడంలో సక్సెస్ అయ్యారు . భారీ వరదల నుంచి విజయవాడ ప్రజలను కాపాడటంలో అలుపెరుగక శ్రమించారు . పాలన భేష్ . . రాజకీయం తుస్ . . అన్న రీతిలో వీరిద్దరి వ్య్వవహార శైలి పై తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి . వీటిని చక్కదిద్దుకుని పార్టీ కార్యకర్తల వద్ద మన్ననలు పొందుతారో . . చేకొట్టించుకుంటారో వాళ్ళిష్టం . ..
జనసేనకు బాలినేని అవసరం ఏమొచ్చింది . .”ఒంగోలులో వైసీపీకి చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి 2024 ఎన్నికల ముందు ఒక మహిళ ”జై వైసీపీ” అనలేదని దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు . ఆమెను పోలీసులు ఒంగోలు గవర్నమెంట్ ఆసుపత్రిలో చేర్చారు . అయినా బాలినేని బ్యాచ్ వదలకుండా . . ఆసుపత్రిపై దాడికి వెళ్లారు . ఈ బ్యాచును దగ్గరుండి తీసుకువెళ్ళింది బాలినేని శ్రీనివాస్ రెడ్డి , ఆయన తనయుడు . విశాఖపట్నం జిల్లాలో లాట్ రైట్ మైనింగ్ అక్రమ తవ్వకాలు , ఎగుమతులతో బాలినేని పై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి . కూటమి అధికారంలోకి వచ్చాక విచారణ చేసి అక్రమాలపై చర్యలు తీసుకుంటామని అప్పట్లో కూటమి నేతలు ప్రగల్బాలు పలికారు . అధికారంలో ఉన్నపుడు తాను చేసిన అవినీతి , అరాచకాల నుంచి రక్షణ పొందేందుకు జనసేన సేఫ్ అని భావించిన బాలినేని . . పవన్ కళ్యాణ్ తో లాబీయింగ్ చేసుకుని పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు . అంతే అయన అరాచకాలు , అక్రమాలు , అవినీతి పక్కకుపోయాయ్ .
సామినేని ఉదయభాను : జగ్గయ్యపేట వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా అధికారంలో ఉన్నపుడు చేసిన భూ కబ్జాలు , అక్రమాలు , అరాచకాలు నుంచి తప్పించుకునేందుకు జనసేనను ఆశ్రయించారని స్థానికి టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు . పైగా మట్టి , గ్రావెల్, ల్యాన్డ్ సెటిల్ మెంట్ బ్యాచ్ లను మళ్ళీ రంగంలోకి దింపుతున్నారని కూడా జనసేన , టీడీపీ కార్యాలయాలకు అనేక ఫిర్యాదులు వెళుతున్నాయి . అధికారంలోకి వచ్చేసారు కదా . .ఇపుడు కార్యకర్తలతో పనేముంది . . అన్న భావనలో ఉన్న టీడీపీ , జనసేన అధిష్టానాలు ఆయా ఫిర్యాదులను చెత్త బుట్టలో వేస్తున్నాయని పార్టీ కార్యకర్తలు తీవ్ర మనోవేదన చెందుతున్నారు .
ఏరు దాటే వరకు ఓడ మల్లన్న . ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న . . . ఇదీ చంద్రబాబు తీరు . .. ప్రతి ఎన్నికల ముందు చంద్రబాబు కార్యకర్తలే నాకు ముఖ్యమంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు . ఎన్నికల తర్వాత ప్రతి సారీ ఇదే పరిస్థితి . 1999, 2014 లలో సైతం ఇలాగే చేసి పార్టీని భ్రష్టు పట్టించారు . ఇపుడు కూడా ఇదే చేస్తున్నారు . .” అంటూ టీడీపీకి చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే వాపోయారు . రాష్ట్రంలో పలు చోట్ల టీడీపీ , జనసేన పార్టీలలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది .
ఏలూరు , నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో పలువురు వైసీపీ కార్పొరేటర్లను టీడీపీలో చేర్చుకున్నారు . టీడీపీలో చేరిన వారిలో కొందరు సెటిల్ మెంట్ కింగ్ లు ఉన్నారు . ఇపుడు జనసేన , టీడీపీ పాత కేడర్ పై వాళ్ళు పెత్తనం చేయడం వారం , పది రోజుల వ్యవధిలోనే మొదలెట్టేసారు.
మరో నాలుగున్నరేళ్ల వరకు ఎన్నికలు లేవన్న భావంతో ఉన్న చంద్రబాబు , పవన్ కళ్యాణ్ ఉన్నట్లు కనిపిస్తోంది . వందరోజులలో ఆంధ్రప్రదేశ్ లో సుపరిపాలన అందిస్తూ . . ప్రజలలో మంచి మార్కులే సంపాదించారు . అయితే పార్టీలో మాత్రం తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకుంటున్నారు .