Kanguva Trailer: తమిళ స్టార్ హీరో సూర్య ( Hero Surya) హీరోగా తెరకెక్కిస్తున్న ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ (Fantacy Action Thriller) మూవీ ‘ కంగువ’ ట్రైలర్ (Kanguva Trailer) విడుదలైంది. మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తుండగా.. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమా (Pan India Movie) గా నిర్మిస్తున్నారు.
ఇప్పటికే సాంగ్స్, టీజర్ విడుదల కావడంతో ప్రేక్షకుల్లో కంగువ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక తాజాగా చిత్ర యూనిట్ కంగువ ట్రైలర్ ను విడుదల (Release) చేశారు. ‘ మనం నివసించే దీవిలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. వాటి అన్నిటి కంటే మనది అంతుచిక్కని రహస్యం అంటూ ఓ మహిళ చెప్పే మాటలతో కంగువ ట్రైలర్ మొదలైంది. ట్రైలర్ లో కథతో పాటు క్యారెక్టర్లు ఏమిటనేది మేకర్స్ రివీల్ చేశారు. యాక్షన్, మ్యూజిక్ ( Action, Music) మరియు విజువల్స్ ఇలా ప్రతిదీ అద్భుతంగా ఉంది. కాగా ఈ చిత్రాన్ని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 12న ప్రపంచ వ్యాప్తం (World Wide) గా కంగువ సినిమా విడుదల కానుంది.