Stree 2 Movie: అడ్వాన్స్ బుకింగ్స్ లో ‘‘ స్త్రీ 2 ’’.. ప్రభాస్ రికార్డ్ బ్రేక్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ( Shraddha Kapoor), రాజ్ కుమార్ ( Raj Kumar) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ స్త్రీ2’( Stree 2). హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో డైరెక్టర్ అమర్ కౌశిక్ తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 15వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే బయటకు వచ్చిన టీజర్ ప్రేక్షకులు, అభిమానుల అంచనాలను మరింతగా పెంచేసింది.

తాజాగా స్త్రీ2 సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ (Advance Bookings) ఓపెన్ చేయగా కనివీని ఎరుగని రీతిలో స్పందన వచ్చింది. ఫైటర్, కల్కి 2898 ఏడీ చిత్రాల అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్లను స్త్రీ2 క్రాస్ చేసి రికార్డ్ (Record) సృష్టించిందని తెలుస్తోంది. అంతేకాదు ఇప్పటివరకు సుమారు రూ.20 కోట్లకు పైగా వచ్చాయని చిత్రయూనిట్ (Movie Unit) పేర్కొంది.

అయితే, 2018 వ సంవత్సరంలో వచ్చిన స్త్రీ మూవీకి ఇది సీక్వెల్. అంతేకాదు రిలీజ్ అయిన మూడు వారాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం స్త్రీ2 అడ్వాన్స్ బుకింగ్స్ లో దూసుకుపోవడంతో ఈ సినిమాపై కూడా సినీ ప్రియులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కాగా అభిమానుల కోసం ఆగస్ట్ 14న ప్రత్యేక ప్రివ్యూ షో (Preview Shows) లను ప్రదర్శిస్తామని మూవీ యూనిట్ తెలిపింది.