Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024 లో 14వ రోజు కొనసాగుతోంది. ఇందులో భాగంగా భారత క్రీడాకారులు పతకాలను సాధించే దిశగా అడుగులు వేయనున్నారు. ఓవరాల్ స్టాండింగ్ లో 64వ స్థానంలో ఉన్న భారత్ నాలుగు కాంస్యాలు, ఒక రజతం సాధించింది.
యువ గ్రాప్లర్ అమన్ సెహ్రావత్ కాంస్య పతకం కోసం ఇవాళ పోటీ పడనున్నారు. 21 ఏళ్ల అమన్ శుక్రవారం ప్యూర్టోరికోకు చెందిన డారియన్ టోయ్ క్రూజ్ తో పోటీకి దిగనున్నారు. అదేవిధంగా మహిళల గోల్ఫ్ మ్యాచ్ తో పాటు మరో మూడు ఆటలు ఈ రోజు జరనున్నాయి.
షెడ్యూల్ భాగంగా మహిళల వ్యక్తిగత గోల్ఫ్ తో పోటీలు ప్రారంభం కానున్నాయి. ముందుగా మధ్యాహ్నం 12.30 గంటలకు గోల్ఫ్ పోటీలో భారత గోల్ఫర్లు అదితి అశోక్, దీక్షా దాగర్ పాల్గొంటారు. తరువాత మహిళలు మరియు పురుషులు 4x 400 మీ రిలే రౌండ్లు మధ్యాహ్నం 2.10 గంటలకు మరియు 2.35 గంటలకు ప్రారంభంకానున్నాయి. అనంతరం రాత్రి 9.45 గంటలకు రెజ్లింగ్ మ్యాచ్ జరగనుంది.
పారిస్ ఒలింపిక్స్ 14వ రోజు భారత్ షెడ్యూల్:
గోల్ఫ్:
మహిళల వ్యక్తిగతం: అదితి అశోక్, దీక్షా దాగర్ – మధ్యాహ్నం 12.30 గంటలకు
అథ్లెటిక్స్:
మహిళల 4x 400 మీ రిలే రౌండ్ 1 – మధ్యాహ్నం 2.10 గంటలకు
పురుషుల 4x 400 మీ రిలే రౌండ్ 1 – మధ్యాహ్నం 2.35 గంటలకు
కుస్తీ:
పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ కాంస్య పతక పోరు: అమన్ సెహ్రావత్ వర్సెస్ డారియన్ టోయ్ క్రూజ్ – రాత్రి 9.45 గంటలకు.