Trinamool Congress : ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనపై బీజేపీది తప్పుడు ప్రచారం.. తృణమూల్ ఆరోపణలు

Trinamool Congress : కోల్‎కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ ఆస్పత్రి ( RG Kar Medical College and Hospital) లో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం మరియు హత్య కేసుపై దేశవ్యాప్తంగా నిరసన (Protests) జ్వాలలు చెలరేగుతున్నాయి. అయితే ఈ ఘటనను వినియోగించుకుని పశ్చిమ బెంగాల్ ( West Bengal) లో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) ఆరోపించింది.

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (CM Mamatha Benarjee) రాజీనామాకు పిలుపునిస్తూ బీజేపీ ఐటీ సెల్ (BJP IT Cell) ప్రచారాన్ని నిర్వహిస్తోందని ఎంపీ సాకేత్ గోఖలే (MP Saket Gokhale) ఆరోపణలు చేశారని తెలుస్తోంది. ఆగస్ట్ 15వ తేదీన ఈ కేసును సీబీఐ స్వాధీనం చేసుకున్నప్పటికీ.. సోషల్ మీడియా వేదికగా మమతా బెనర్జీ రాజీనామా చేయాల్సిందేనని పార్టీ ట్రెండింగ్ (Party Trending) లో ఉందని చెప్పారని సమాచారం. ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం బీజేపీ ఇటువంటి ప్రచారాలను నిర్వహిస్తోందని ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆరోపణలు (Allegations) చేశారు. నిరసనకారుల స్థానంలో బీజేపీ తమ కార్యకర్తలను చేర్చుతోందన్నారు. అయితే నిజమైన నిరసనకారులు కానీ, ప్రజలు కానీ మమతా బెనర్జీ రాజీనామా చేయాలి అనే హ్యాష్ ట్యాగ్ (Hashtag) ను ఉపయోగించడం లేదని తెలిపారు.