Chhaava Teaser Released: బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ( Vicky Kaushal) , నేషనల్ క్రష్ రష్మిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘‘ ఛావా’’. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం(Laxman Utekar Direction) లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ (Sambhaji) మహరాజ్ జీవిత చరిత్ర (Biography)ఆధారంగా రూపొందిస్తున్నారు.
తాజాగా ఛావా సినిమా టీజర్ (Movie Teaser) ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. భారీ యాక్షన్ తో ఉన్న టీజర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. కాగా ఈ సినిమాను డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ (Release) చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే అదే రోజున టాలీవుడ్ యంగ్ హీరో అల్లు అర్జున్ – రష్మిక నటించిన ‘‘ పుష్ప 2 (Pushpa 2) ’’ కూడా థియేటర్లలో విడుదలకు సిద్ధం అవుతోంది. దీంతో బాక్సాఫీస్ (Boxoffice) వద్ద మరో టఫ్ ఫైట్ ఖాయమైందని చెప్పుకోవచ్చు.