Kanguva Vs Vettian: సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajanikanth) మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యారు. గతేడాది జైలర్ సినిమా (Jailer Movie) తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన మంచి కంబ్యాక్ అందుకున్నారు. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ( Director Nelson Deelip Kumar) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రూ.600 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం రజనీకాంత్ తన 170 వ సినిమా ‘‘ వెట్టియాన్’’ ( Vettian). ప్రముఖ దర్శకుడు టీ జే జ్ఞానవేల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్ బ్యానర్ (Lyca Productions Banner) పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తెలుగులో వేటగాడు పేరుతో ఈ చిత్రంపై ప్రేక్షకులు, అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, రానా, ఫహద్ ఫాజిల్, రితికా సింగ్ వంటి నటీనటులు ప్రత్యేక పాత్రలు పోషించగా.. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మూవీ మేకర్స్ ( Movie Makers) ప్రకటించారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 10వ తేదీన ప్రపంచ వ్యాప్తం (World Wide) గా రిలీజ్ కానుంది.
అయితే వెట్టియాన్ విడుదల అవుతున్న సంతోషం ఉన్నప్పటికీ కొందరిలో కొంత కంగారు ఉందని తెలుస్తోంది. దీనికి కారణం అదే రోజు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ‘‘ కంగువ (Kanguva) ’’ కూడా విడుదల కానుంది. ఒకే రోజు రెండు సినిమాలు వస్తుండటంతో వీటి మధ్య పోటీ రసవత్తరంగా మారనుందనే చెప్పుకోవాలి. అయితే వీటిలో ఏ సినిమా అయినా వెనక్కి తగ్గుతుందా ? లేక రెండూ ఒకే రోజు విడుదల అవుతాయా అనేది చూడాలి.