Heavy rain in Hyderabad: భారీ వర్షం వస్తే భాగ్యనగరం పరిస్థితి ఇంతే …. మెట్రో లేకపోతే ఏంటి పరిస్థితి ?

మంగళవారం తెల్లవారుఝామున హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి .  దీంతో ఆఫీసులకు ,  స్కూల్స్ ,  కాలేజీలకు, ఇతర పనులకు వెళ్లాల్సిన జనం మెట్రో రైళ్లను ఆశ్రయించారు .  మెట్రో లేకపోతే ఇలాంటి భారీ వర్షాలు కురిసినప్పుడు హైదరాబాద్ జనం పరిస్థితి ఏమై ఉండేది . ..??

భారీ వర్షాలకు హైదరాబాద్ – సికింద్రాబాద్ నగరాల ప్రధాన రహదారులన్నీ జలమయం కావడంతో ఈ రెండు నగరాల వాసులు కార్లు ,  మోటార్ సైకిళ్ళు ,  ఆటోలు ,  క్యాబ్లు వదిలి మెట్రో రైళ్లను ఆశ్రయించారు .

ఓ మోస్తరు వర్షం కురిస్తే హైదరాబాద్ – సికింద్రాబాద్ జంట నగరాలలో జనం దుస్థితి చెప్పనలవికాదు .  చెరువులు ,  కాల్వలు  ఆక్రమణలకు గురికావడం,, డ్రైనేజీలలో ప్లాస్టిక్ వ్యర్ధాలు పేరుకుపోవడం వంటి కారణాలతో భారీ వర్షాలకు జంట నగరాల రోడ్లు కాల్వలను తలపిస్తుంటాయ్ . . దశాబ్ద కాలంగా భాగ్యనగరం పరిస్థితి ఇంతే .  హైదరాబాద్ మహానగరంగా విస్తరించి . .. 100 కిలోమీటర్ల మేర వ్యాపించినా . . ప్రధాన నగరంలో మాత్రం ఈ పరిస్థితి ఇప్పట్లో మారేలా కనిపించడంలేదు .

భాగ్యనగరం ముంపుపై పరిష్కారంపై ప్లాన్ ఏదీ ?   హైదరాబాద్ – సికింద్రాబాద్ జంట నగరాల ముంపు సమస్య నుంచి బయటపడే మార్గం కనిపించడంలేదు .  దశాబ్దాలుగా చెరువులు ,  డ్రెయిన్స్ ఆక్రమణలకు గురికావడం , నగరంలో ప్లాస్టిక్ వినియోగం ఏటేటా అనేక రేట్లు పెరుగుతుండటం . . ఆ చెత్తను డ్రెయిన్స్ లో వేయడం వంటి వాటిని అరికట్టకుండా భాగ్యనగరాన్ని ముంపు నుంచి బయటపడే పరిస్కారం దొరకదు .  అంతా ప్రభుత్వమే చూసుకుంటుంది . . అనుకోవడం కంటే . . ఎవరికీ వారు తమ బాధ్యతలను కూడా గుర్తెరిగితే కానీ ఇలాంటి సమస్యలకు పరిస్కారం దొరకదు .