నెల్లూరు నగరం కోటమిట్టలోని మస్కట్ వీధిలోని ఆర్ట్ గ్లోబ్ కిడ్స్ మాల్ లో సోమవారం రాత్రి బహుమతుల ప్రదానం జరిగింది. సికిందర్ గ్రూప్ అధినేత అఖిల్, సీనియర్ జర్నలిస్ట్ ఫయాజ్, రబ్బాని, మదీనా గ్రూప్ అధినేతలు, షోయబ్, ఉస్మాన్ విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మాల్ అధినేత రాహిల్ తాజ్ మాట్లాడుతూ యువతలో విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తిని పెంచడమే ఈ క్రీడల ఉద్దేశమని తెలిపారు. ఆర్ట్ గ్లోబ్ లో ఇండోర్ గేమ్స్ ఆటల పోటీలు శనివారం నుంచి మూడు రోజుల పాటు జరిగాయి. నెల్లూరు నగరంలోని నలుమూలల నుంచి పలువురు యువకులు, విద్యార్థులు దాదాపు 4 వందల మందికి పైగా ఈ పోటీలకు హాజరయ్యారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతకు పదివేలు, రెండో విజేతకు 3వేలు, మూడో విజేతకు 2 వేల నగదు చొప్పున బహుమతులను అందజేశారు. అలాగే ఈ పోటీల్లో పాల్గొన్న ఆటగాళ్ల పేర్ల నుంచి లక్కీ డిప్ లను తీసి మదీనా గ్రూపు వారు 15 వాచ్ లను బహుకరించారు. ఈ ఆటల పోటీలకు ప్రముఖ వ్యాపార సంస్థలైన డాక్టర్ కిషోర్ రత్నం స్కూల్స్ గ్రూప్, వైజయంతి గ్రూప్, సికిందర్ టీ గ్రూప్, ది జైల్ మంది, ఎస్జెబి చికెన్ షాప్ వారు స్పాన్సర్ షిప్ ను అందించారు. ఆర్ట్ గ్లోబ్ కిడ్స్ మాల్ నిర్వాహకులు వసీం, ముజమ్మిల్, ఆరిఫ్, అజ్మతుల్లా తదితరులు హాజరయ్యారు. ఇండోర్ ఆటల పోటీల సందర్భంగా ఆర్ట్ గ్లోబ్ కిడ్స్ మాల్ లో కోలాహలం నెలకొంది.