అగ్రరాజ్యం అమెరికాలోని టెక్సాస్(Texas) లో ఎత్తైన హనుమాన్ విగ్రహం ఏర్పాటైంది. ఇది సుమారు 90 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహం కాగా దీనికి ‘స్టాట్యూ ఆఫ్ యూనియన్ (Statue of Union) ’ గా పేరు పెట్టారు. టెక్సాస్ లో అత్యంత ఎత్తైన విగ్రహం ఇదే కావడం విశేషం.
అంతేకాదు న్యూయార్క్ లో ఉన్న స్టాట్యూ ఆఫ్ లిబర్టీ(Statue of Liberty) , ఫ్లోరిడాలోని పెగాసస్ అండ్ డ్రాగన్ (Pegasus and Dragon) విగ్రహాల తరువాత హనుమాన్ విగ్రహం చోటు దక్కించుకుంది. కాగా టెక్సాస్ సుగర్ ల్యాండ్ లోని శ్రీ అష్టలక్ష్మీ ఆలయం ( Sri Astalaxmi Temple) లో ఈ నెల 15వ తేదీ నుండి 18వ తేదీ వరకు ప్రాణప్రతిష్ట మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా హనుమాన్ విగ్రహాన్ని శ్రీ చినజీయర్ స్వామి (Chinajiyar Swamy) చేతుల మీదుగా ప్రతిష్టించారు. అనంతరం 72 అడుగుల దండను విగ్రహం మెడలో వేశారు.