బద్లాపూర్ పాఠశాల (Badlapur School) లో ఇటీవల ఇద్దరు నర్సరీ బాలికలపై జరిగిన లైంగిక వేధింపులకు నిరసనగా మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) రేపు మహారాష్ట్ర బంద్ (Maharastra bandh) కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బంద్ కు కాంగ్రెస్ పార్టీతో పాటు శివసేన, ఎన్సీపీలు మద్ధతు (Support) తెలిపాయి.
ఈ ఘటనపై తీవ్రస్థాయిలో నిరసన కార్యక్రమాలు (Protests) వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రతిపక్ష నేతలు బంద్ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. రేపు (Tomorrow) నిర్వహించే మహారాష్ట్ర బంద్ కార్యక్రమంలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం (Political intent) లేదని తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బంద్ కు స్వచ్ఛంధంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పార్టీల నేతలు పిలుపునిస్తున్నారు. అయితే రేపటి బంద్ కు మహారాష్ట్ర సర్కార్ నుంచి ఎలాంటి మద్ధతు లేదని తెలుస్తోంది. దీని కారణంగా ప్రజా రవాణా యథావిధిగా పని చేసే ఛాన్స్ ఉందని సమాచారం.