యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) మరో ఖ్యాతిని సాధించారు. ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ (Ormax Media) విడుదల చేసిన మోస్ట్ పాపులర్ హీరోల జాబితా (Most Popular Hero’s List) లో ప్రభాస్ అగ్రస్థానంలో నిలిచారు. తాజాగా జులై నెలకు సంబంధించి దేశవ్యాప్తంగా మోస్ట్ పాపులర్ స్టార్ ల జాబితాను రిలీజ్ (List Release) చేసింది.
బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ లను వెనక్కి నెట్టి ప్రభాస్ ఈ ఘనతను సాధించారు. జాబితా ప్రకారం మొదటి స్థానం (First Place) లో ప్రభాస్ ఉండగా రెండో స్థానంలో కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ఉన్నారు. మూడో స్థానంలో షారూక్ ఖాన్, నాలుగో స్థానంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఐదో స్థానంలో జూనియర్ ఎన్టీఆర్, ఆరో స్థానంలో అక్షయ్ కుమార్, ఏడో స్థానంలో అల్లు అర్జున్, ఎనిమిదో స్థానంలో సల్మాన్ ఖాన్, తొమ్మిదో స్థానంలో రామ్ చరణ్ ఉండగా పదో స్థానంలో అజిత్ కుమార్ నిలిచారు.
కాగా మే, జూన్ నెలలలో కూడా నంబర్ వన్ స్థానంలో ప్రభాస్ ఉన్నారు. తాజాగా కల్కి సినిమా (Kalki Movie) విడుదల నేపథ్యంలో గత రెండు నెలల కాలంగా ప్రభాస్ పేరు ట్రెండింగ్ (Trending) లో ఉంది. మూడోసారి కూడా ప్రభాసే నంబర్ వన్ హీరోగా నిలవడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు మోస్ట్ పాపులర్ హీరోయిన్స్ జాబితాలో మొదటి స్థానంలో అలియా భట్ నిలిచారు. ఆ తరువాత సమంత, దీపికా పదుకొణె, కాజల్ అగర్వాల్, నయనతార, కత్రినా కైఫ్, త్రిష, కియారా అద్వానీ, కృతి సనన్ మరియు రష్మిక టాప్ టెన్ లో నిలిచారు.