తెలంగాణ -టు- అరుణాచలం

కార్తీక మాసంలో అరుణాచలేస్వరుడి దర్సనం కోసం తహతహలాడే వారి కోసం తెలంగాణ ఆర్టీసి ప్రత్యేక ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుంచి తమిళనాడులోని అరుణాచలం వరకు స్పెషల్ బస్సులు నడపడానికి సన్నాహాలు చేసారు .

హైదరాబాద్ లో ఈ నెల 13 న బస్సులు బయలుదేరతాయ్. హైదరాబాద్ తో పాటు తెలంగాణ లో ఇతర ప్రాంతాల నుంచి కూడా బస్సులను అరుణాచలానికి నడుపుతున్నారు .  13న బయలుదేరే భక్తులకు 14, 15 తేదీలలో అరుణాచలం శివుడి దర్శనం ,  గిరి ప్రదక్షణ పూర్తయిన తర్వాత 16 వ తేదీన తిరుగు ప్రయాణం అవుతాయి .

చిత్తూరు జిల్లా కాణిపాకం, వెల్లూరులోని శ్రీ నారాయణి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం 16న తిరిగి ప్రత్యేక బస్సులు హైదరాబాద్‌కు చేరుకుంటాయి .    కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచలం గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ ఆర్టీసి అధికారులు సూచించారు. ఈ స్పెషల్‌ బస్సుల టికెట్‌ బుకింగ్‌ కోసం ww w.tgsrtconline.in లో లేదా టీజీఎస్‌ఆర్‌టీసీ అన్ని కౌంటర్‌లలో బుక్‌ చేసుకోవాలి .    ఈ నెల 13న పటాన్‌చెరూ, రామచంద్రాపురం, బీహెచ్‌ఈఎల్‌, మియాపూర్‌, కేపీహెచ్‌బీ, అమీర్‌పేట, ఎంజీబీఎస్‌, జేబీఎస్‌ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు .    అరుణాచలం వెళ్లే భక్తులు బీహెచ్‌ఈఎల్‌ నుంచి సూపర్‌ లగ్జరీ రూ. 4000, రాజధాని రూ. 5360, ఎంజీబీఎస్‌ నుంచి సూపర్‌ లగ్జరీ రూ. 3900, రాజధాని రూ. 5230 టికెట్‌ చార్జీలను నిర్ణయించారు .

ఇంకా మరింత సమాచారం కావాలంటే . … 9959226149, 99592261 53,9959226249, 9959226250 నంబర్లలో సంప్రదించాలి .