Samshabad: షార్జా విమానానికి బాంబు బెదిరింపు

హైదరాబాదు శంషాబాద్ విమానాశ్రయంలో ఫైట్ ఎక్కిన ఓ ప్రయాణికుడు తన వద్ద బాంబు ఉందంటూ కేకలు వేశాడు. విమానాశ్రయ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని, అతనిని, లగేజీని తనిఖీ చేశారు. కానీ ఎలాంటి బాంబును గుర్తించలేదు. ఈ ఘటన జరిగినప్పుడు విమానంలో 136 మంది ప్రయాణికులు ఉన్నారు. మొదట వారిని కిందకు దించారు. విమానాన్ని ఐసోలేషన్ ప్రాంతానికి తీసుకెళ్లి తనిఖీలు చేశారు. నిన్న నాగపూర్ విమానానికి కూడా ఓ బాంబు బెదిరింపు వచ్చింది. గత కొన్నిరోజులుగా పదులు, … Read more

Fire Accident: బాణసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం

దీపావళి సందర్భంగా బాణసంచా దుకాణాలు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే హైదరాబాదుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల పోలీసు అధికారులు హెచ్చరికలు, జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఓ క్రాకర్స్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాంకోఠిలోని (బొగ్గులకుంట) హోల్‌సేల్ క్రాకర్స్ దుకాణంలో టపాసులు పేలి మంటలు చెలరేగాయి. 4 ఫైరింజన్ల సాయంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. దుకాణంలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరగడంతో స్థానికులు … Read more

Hyderabad: హైదరాబాద్‌లో నెల రోజులు 144 సెక్షన్… పోలీసు కమిషనర్

హైదరాబాద్‌లో నెల రోజుల పాటు 144 సెక్షన్  ఆంక్షలు కొనసాగుతాయని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు.  సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని తెలిపారు. అనుమతులు లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అక్టోబర్ 27 సాయంత్రం 6 గంటల నుంచి నవంబర్ 28 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువమంది వ్యక్తుల సమావేశం, ర్యాలీలు, బహిరంగ సభలపై ఆంక్షలు … Read more

Cheetah: అది చిరుత కాదు.. పిల్లి..  అట‌వీశాఖ క్లారిటీ

హైద‌రాబాద్‌లోని మియాపూర్ మెట్రోస్టేష‌న్ స‌మీపంలో చిరుత సంచారం అంటూ జ‌రిగిన ప్ర‌చారానికి తెరపడింది. దీనిపై  అట‌వీశాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. శుక్ర‌వారం రాత్రి ఓ అపార్ట్‌మెంట్ స‌మీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో చిరుత సంచ‌రించ‌డం క‌నిపించింద‌ని స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. అంతే కాదు నగరంలో ఈ ప్రచారం దుమారం రేపింది. అంతా చిరుత చిరుత అంటూ భయాందోళనలో పడ్డారు. స్థానికుల స‌మాచారంతో అట‌వీశాఖ అధికారుల‌తో క‌లిసి ఘ‌ట‌నాస్థ‌లికి వెళ్లిన పోలీసులు చిరుత కోసం గాలించారు. చిరుత పాద‌ముద్ర‌లను … Read more

Rape: హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగినిపై సామూహిక అత్యాచారం

హైదరాబాద్ లో ఘోరం జరిగింది. మరో మహిళ అత్యాచారానికి గురైంది.  ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై ఆటోలో ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన నిన్న అర్ధరాత్రి గచ్చిబౌలి ప్రాంతంలో జరిగింది.  నిన్న అర్ధరాత్రి గచ్చిబౌలి ప్రాంతంలోని ఆర్సీ పురంలో ఐటీ ఉద్యోగిని ఆటో ఎక్కింది. అర్ధరాత్రి 2.30 ప్రాంతంలో ఆటో మసీద్ బండ ప్రాంతానికి చేరుకుంది. అక్కడ ఆమెపై ఆటో డ్రైవర్ తో పాటు, మరో యువకుడు ఆటోలోనే అత్యాచారం చేశారు. అనంతరం … Read more

Hyderabad: ఆ బాధితులకు రూ.25వేల ప్రోత్సాహకం

మూసీ నది ప్రక్షాళనలో భాగంగా పరిసర ప్రాంతంలో నివాసం ఉంటున్న వారిని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖాళీ చేయిస్తున్న విషయం తెలిసిందే.  నిర్వాసితుల్లో చాలా మంది చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం సాగించే వారు. వారికి ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయిస్తున్నా చాలా మంది దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయిస్తున్న చోటుకు వెళ్లేందుకు ప్రభుత్వం బాధిత కుటుంబాలకు రూ.25వేలు ప్రోత్సాహకం అందించనుంది. ఇల్లు … Read more

Today Gold and Silver Rates: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Hyderabad: రూ.70,000 దాటేసిన తులం బంగారం ధర మెల్లగా తగ్గుముఖం (gold and silver price decrease) పట్టింది. గత కొన్ని రోజులుగా చుక్కలు తాకిన పసిడి.. రెండూ రోజు స్వల్పంగా తగ్గింది. దీంతో ధరల్లో మార్పులు జరిగాయి. నేడు (సెప్టెంబర్ 30) దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వైజాగ్ లలో మాత్రమే కాకుండా.. బెంగళూరు, ముంబైలలో (major cities) కూడా సోమవారం పసిడి ధరలు వరుసగా … Read more

Hydra: విచారణకు హాజరు కావాలి.. హైడ్రా కమిషనర్ కు హైకోర్టు ఆదేశం

అమీన్ పూర్ చెరువుకు సంబంధించిన కేసు విషయంలో విచారణ చేపట్టిన హైకోర్టు…. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్: అమీన్ పూర్ చెరువుకు సంబంధించిన కేసు విషయంలో విచారణ చేపట్టిన హైకోర్టు… హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు నోటీసులు జారీ చేసింది. హైడ్రా కమిషనర్ సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.  అమీన్ పూర్ చెరువు FTL పరిధిలో ఉందని ఇటీవల ఓ భవనాన్ని హైడ్రా సిబ్బంది కూల్చివేశారు.  కోర్టులో కేసు పెండింగ్ … Read more