Assembly Elections Schedule: దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. ఈ మేరకు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ( Assembly Elections) కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) షెడ్యూల్ ను ప్రకటించనుంది. ఇందుకోసం మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనుంది.
మహారాష్ట్ర, ఝార్ఖండ్ మరియు హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ( Election Schedule) ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే జమ్మూకశ్మీర్ లోనూ వీలైనంత త్వరగా శాసనసభ ఎన్నికలను నిర్వహించాలని కేంద్రం ఏర్పాట్లు (Central Arrangements) ముమ్మరం చేస్తోందని సమాచారం. ఈ నేపథ్యంలో అక్కడి ఎన్నికల షెడ్యూల్ ను సైతం ఈసీ ప్రకటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
మహరాష్ట్ర మరియు హర్యానా రాష్ట్రాల అసెంబ్లీలకు నవంబర్ నెలతో గడువు ముగియనుందన్న సంగతి తెలిసిందే. ఇక ఝార్ఖండ్ చట్టసభ పదవీకాలం జనవరితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ మూడు రాష్ట్రాలకు షెడ్యూల్ విడుదల కానుందని సమాచారం. మరోవైపు కేంద్రం తీసుకువచ్చిన ఆర్టికల్ 370 ( Article 370) రద్దును సమర్థిస్తూ భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది. ఈ క్రమంలోనే వచ్చే సంవత్సరం సెప్టెంబర్ 30 లోగా అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. అంతేకాకుండా సీఈసీ నేతృత్వంలోని ఎన్నికల సంఘం ప్రతినిధి బృందం అక్కడ పర్యటించి పరిస్థితులను సమీక్షించారు. దీంతో జమ్మూకశ్మీర్ ( Jammu and Kashmir) అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అవుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.