Paiditalli – Vizianagaram: పైడితల్లి ఉత్సవాలకు లోకసభ స్పీకర్ ఓం బిర్లాకు ఆహ్వానం

ఢిల్లీ: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆహ్వానించారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు వంశీయుల అభీష్టం మేరకు ఆహ్వానం పలికినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 13 నుంచి 15 వరకు పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఓం బిర్లాను కలిసిన సందర్భంగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అప్పలనాయుడు ఆయనకు అందజేశారు.

Narendra Modi – Chandrababu: ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ

ఢిల్లీ:  రెండు రోజుల హస్తిన పర్యటనకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu). ప్రధాని మోదీ (PM Modi) తో భేటీ అయ్యారు. మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లిన చంద్రబాబు.. ఢిల్లీ చేరుకొని నేరుగా ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. అమరావతి, పోలవరం నిధులు, రాష్ట్రంలో వివిధ రహదారుల అభివృద్ధి, రైల్వేజోన్ శంకుస్థాపన, సెయిల్ లో విశాఖ స్టీల్ విలీనం, ఇటీవల సంభవించిన వరద బాధితులను ఆదుకొనేందుకు కేంద్రం … Read more

PM Modi Garba Song: నవరాత్రి స్పెషల్ సాంగ్ – ‘గర్బా’పై పాట రాసిన ప్రధాని మోదీ

నవరాత్రి సందర్భంగా గుజరాతీల సంప్రదాయ నృత్యమైన ‘గర్బా’పై ప్రధాని నరేంద్ర మోదీ ఒక ప్రత్యేకమైన పాటను రాశారు. ఆ పాటను ఈరోజు  (సోమవారం) ఆయన తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్​ చేశారు. ”ఈ పవిత్ర నవరాత్రుల్లో దుర్గాదేవిని ప్రజలు ఐక్యంగా, వివిధ రకాలుగా ఆరాధిస్తారు. ఈ ప్రత్యేక సమయంలో అమ్మవారి శక్తి, దయను కీర్తిస్తూ ‘ఆవతీ కాలయ్’ అనే గర్బా పాటను రాశాను. మనందరిపై దుర్గా దేవి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా.’ అని ఎక్స్​ వేదికగా … Read more

MS Dhoni: స్టాక్ మార్కెట్‌లో ధోనీ భారీ ఇన్వెస్ట్‌మెంట్.. పెట్టుబడి ఎంత అంటే..

Garuda Aerospace: క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోని డ్రోన్ స్టార్టప్ కంపెనీ గరుడ ఏరోస్పేస్‌లోతన పెట్టుబడిని పెంచాడు. ఐపీఓ-బౌండ్ స్టార్టప్‌లో బ్రాండ్ అంబాసిడర్‌గా తిరిగి చేరాడు. దీంతో ప్రస్తుతం డ్రోన్ స్టార్టప్‌లో రూ.3కోట్ల పెట్టుబడి పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2030 నాటికి భారత్‌ను డ్రోన్ హబ్‌గా మార్చాలన్న గరుడ విజన్‌పై తనకు నమ్మకం ఉందని ధోనీ చెప్పాడు. ఈ కొత్త పెట్టుబడితో స్టార్టప్‌లో ధోనీకి దాదాపు 1.1 శాతం వాటా ఉంది. గరుడతో తన అనుబంధం గురించి … Read more

PM Modi: దేవీశ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్సవాల్లో  ఢోలు వాయించిన ప్ర‌ధాని మోదీ..

ప్రధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఈ రోజు ఉద‌యం మ‌హారాష్ట్ర పర్య‌ట‌న‌కు వెళ్లారు. దీనిలో భాగంగా నాందేడ్ చేరుకున్న ఆయ‌న‌కు బీజేపీ నేత అశోక్ చ‌వాన్ స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం మోదీ పొహ‌ర‌దేవీ ప్రాంతానికి వెళ్లారు. అక్క‌డ ఉన్న జ‌గ‌దాంబ ఆల‌యాన్ని సంద‌ర్శించారు. అనంతరం మూల‌విరాట్ అమ్మ‌వారికి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.  ఈ సందర్భంగా ఆల‌యంలో ఏర్పాటు చేసిన ఢోలు మోగించారు. ఆ త‌ర్వాత సంత్ మ‌హారాజ్, రామ్‌రావ్ మ‌హారాజ్ స‌మాధి అయిన చోటును సంద‌ర్శించి నివాళులు … Read more

New Classical Languages: మోదీ సర్కార్ కీలక నిర్ణయం.. ఐదు భాషలకు శాస్త్రీయ హోదా

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో ఉన్న 5 భాషలకు శాస్త్రీయ హోదా/ప్రాచీన హోదా(క్లాసికల్ హోదా) ఇస్తున్నట్లు ప్రకటించింది. బెంగాలీ, అస్సామీ, మరాఠీ, పాళీ, ప్రాకృతం లాంగ్వేజీలకు క్లాసికల్ స్టేటస్‌ను ప్రకటించింది. ఈ సందర్భంగా క్లాసికల్ స్టేటస్ కలిగిన లాంగ్వేజీల సంఖ్య 11కి చేరింది. ఇంతకు ముందు 6 భాషలకు మాత్రమే క్లాసికల్ స్టేటస్ ఉండేవి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఒడియా, సంస్కృతం భాషలకు క్లాసికల్ … Read more

Tirumala Laddu – Supreme Court: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం – ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటుకు సుప్రీంకోర్టు సూచన

ఢిల్లీ:  తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర సిట్​ ఏర్పాటుకు ఇవాళ (శుక్రవారం) సుప్రీంకోర్టు ఆదేశించింది. ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్​ ఏర్పాటు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఈ సిట్​లో సీబీఐ నుంచి ఇద్దరు అధికారులు, ఏపీ ప్రభుత్వం నుంచి ఇద్దరు పోలీసు అధికారులు, ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ నుంచి సీనియర్​ అధికారి ఉండాలని న్యాయస్థానం సూచించింది. సిట్​ దర్యాప్తును సీబీఐ డైరెక్టర్​ పర్యవేక్షిస్తారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోర్టులను రాజకీయ వేదికలుగా వినియోగించవద్దని సుప్రీంకోర్టు పలు సూచనలు చేసింది. … Read more

Sonbhadra: ఉత్తరప్రదేశ్‌లో గిరిజన యువకుడి  నోట్లో మూత్రం పోసి చిత్రహింసలు

ఉత్తరప్రదేశ్‌లో అమానవీయ ఘటనలు అధికమయ్యాయి.  సోనభద్రలో తాజాగా మరో దారుణమైన ఘటన చోటుచేసుకుంది.  ఓ గిరిజన యువకుడిపై దాడిచేసిన కొందరు యువకులు అతడి తల,  ముఖంపై నోట్లోనూ మూత్రం పోసి చిత్రహింసలకు గురిచేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యువకుడిని కొడుతూ, తన్నుతూ దారుణంగా హింసించిన దుండగులు ఆపై మూత్రం పోయడం ఆ వీడియోలో కనిపిస్తుంది. నిందితులపై చర్యలు తీసుకోవాలని బాధిత యువకుడి సోదరుడు శివకుమార్ ఖర్వార్ కోరాడు. ఈ వీడియోను … Read more

Devendra Bhuyar:  మహిళలపై మహారాష్ట్ర ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

మహిళలపై అసభ్య, వివాదాస్పద వ్యాఖ్యలు ఇటీవల ఎక్కువయ్యాయి. తాజా మహారాష్ట్ర స్వతంత్ర ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మద్దతుదారుడైన దేవేంద్ర భూయార్ మహిళలు, రైతు బిడ్డలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం అమరావతిలోని ఓ బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల కుమారులు పెళ్లి చేసుకునేందుకు యువతులే దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘అందంగా ఉన్న యువతులు నీలాగా, నాలాగా ఉన్న వారిని ఎంచుకోవడం లేదు. ఉద్యోగం ఉన్న వాళ్లనే  ఎంచుకుంటున్నారు’’ అని చెప్పారు.  … Read more

Prakash Raj: మరో సంచలన ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్

వరుస ట్వీట్లతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న వర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ ఇప్పుడు మరోసారి ట్వీట్ చేశారు. గాంధీ జయంతి, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతికి విషెస్ తెలుపుతూనే.. ‘ఒకవేళ నువ్వు మైనారిటీలో భాగమైనప్పటికీ.. నిజం ఎప్పటికీ నిజమే” అని గాంధీజి చెప్పిన మాటలను, అలాగే ” ఆలయాలు, మసీదులు, గురుద్వారాలు, చర్చిలు మనకు ఉన్నాయి. కానీ వాటిని మనం రాజకీయాల్లోకి తీసుకురాము. ఇదే మనకు, పాకిస్థాన్‌కు ఉన్న తేడా” అని లాల్‌బహదూర్‌ శాస్త్రి చెప్పిన మాటలను … Read more