వరుస ట్వీట్లతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న వర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ ఇప్పుడు మరోసారి ట్వీట్ చేశారు.
గాంధీ జయంతి, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతికి విషెస్ తెలుపుతూనే.. ‘ఒకవేళ నువ్వు మైనారిటీలో భాగమైనప్పటికీ.. నిజం ఎప్పటికీ నిజమే” అని గాంధీజి చెప్పిన మాటలను, అలాగే ” ఆలయాలు, మసీదులు, గురుద్వారాలు, చర్చిలు మనకు ఉన్నాయి. కానీ వాటిని మనం రాజకీయాల్లోకి తీసుకురాము. ఇదే మనకు, పాకిస్థాన్‌కు ఉన్న తేడా” అని లాల్‌బహదూర్ శాస్త్రి చెప్పిన మాటలను ఆయన సోషల్ మీడియాలో ‘x’ వేదికగా పంచుకున్నారు. ఇప్పుడు ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.