Tirumala Laddu – Supreme Court: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం – ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటుకు సుప్రీంకోర్టు సూచన
ఢిల్లీ: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర సిట్ ఏర్పాటుకు ఇవాళ (శుక్రవారం) సుప్రీంకోర్టు ఆదేశించింది. ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఈ సిట్‌లో సీబీఐ నుంచి ఇద్దరు అధికారులు, ఏపీ ప్రభుత్వం నుంచి ఇద్దరు పోలీసు అధికారులు, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి సీనియర్ అధికారి ఉండాలని న్యాయస్థానం సూచించింది. సిట్ దర్యాప్తును సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోర్టులను రాజకీయ వేదికలుగా వినియోగించవద్దని సుప్రీంకోర్టు పలు సూచనలు చేసింది. … Read more