కోల్కతా (Kolkata)లోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రి ప్రాంగణంలో చోటు చేసుకున్న విధ్వంసంపై రాష్ట్ర హైకోర్టు (High Court) తీవ్రస్థాయిలో సీరియస్ అయింది. ఈ క్రమంలోనే మమతా బెనర్జీ ప్రభుత్వం (Mamatha Benarjee Government) పై మండిపడింది. విధ్వంసానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఆర్జీకర్ మెడికల్ కాలేజీ (RG Kar Medial College) ప్రాంగణంలో విధ్వంస ఘటన దురదృష్టకరమని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు తలెత్తే అవకాశం ఉన్నప్పుడు పోలీసులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారని న్యాయస్థానం ప్రశ్నించింది. 144 సెక్షన్ ( 144 Section) ఎందుకు విధించలేదో చెప్పాలని పేర్కొంది. వైద్యులు (Doctors) తమ విధులను భయం లేకుండా నిర్వర్తించేలా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. అలాగే భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.