హీరోయిన్ సాయిపల్లవి అంటే తెలుగు జనాలకు ఓ ప్రత్యేకమైన అభిమానం. తనకంటూ స్పెషల్ గా గుర్తింపు సంపాదించుకుంది. తన సహజమైన నటనతో తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో ఆమెకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అలాంటి సాయిపల్లవి తాజా చిత్రం ‘అమరన్’. విడుదలకు రెడీ అవుతోంది. రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ‘మేజర్ ముకుంద్ వరదరాజన్’ జీవితచరిత్ర ఆధారంగా రూపొందింది. శివకార్తికేయన్ హీరోగా నటించిన ఈ సినిమా రేపు థియేటర్లకు రానుంది.
ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. తాజాగా సాయిపల్లవి ‘గ్రేట్ ఆంధ్ర’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని అనుభూతులను పంచుకుంది. “ఇది ఒక బయోపిక్ , ఒక జవాన్ కి వృత్తి పరంగా ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి. దేశం కోసం పోరాటం చేసే అతనికి ఫ్యామిలీ వైపు నుంచి ఎంతటి సపోర్ట్ ఉంటుందనేది ఈ సినిమాలో చూపించడం జరిగింది. ఈ సినిమాలో నేను చేస్తున్న పాత్ర ఏమిటో నిజ జీవితంలో వారితో నేను 3 గంటల పాటు మాట్లాడిన తరువాత ఒక అవగాహనకి వచ్చాను అని చెప్పింది.
” ఒక ఆర్మీ మెన్ జీవితంలో ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయనేది నాకు అర్థమైంది. నటిస్తుంటేనే నాకు ఏడుపు వచ్చిందంటే, ఇక రియల్ లైఫ్ ఎలా ఉంటుందనేది ఊహించుకోవచ్చు. సోల్జర్ ను పెళ్లి చేసుకోవలసి వస్తే భయంగానే అనిపిస్తుంది. తప్పదు అంటే నేను స్ట్రాంగ్ అవుతాను .. ‘నీతో పాటు నేను కూడా వస్తాను అని చెబుతాను’ అంటూ నవ్వేశారు. తన కెరియర్లో ఒక ప్రత్యేక స్థానంలో ఈ సినిమా నిలుస్తుందనే నమ్మకం ఉందని ఆమె చెప్పారు.