ప్రముఖ మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohan Lal) ఆస్పత్రిలో చేరారన్న వార్త సోషల్ మీడియా (Social Media) లో వైరల్ గా మారడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థిస్తున్నారు.
తీవ్ర జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడం (Breathing Issue)లో ఇబ్బంది రావడంతో మోహన్ లాల్ కొచ్చి(Kochchi) లోని ఓ ఆస్పత్రిలో చేరారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆస్పత్రి అధికారులే వెల్లడించారని సమాచారం. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి (Health Condition) మెరుగ్గా ఉందని, కోలుకుంటున్నారని బులెటిన్ లో వైద్యులు పేర్కొన్నారు. కాగా మోహన్ లాల్ ప్రస్తుతం ఎంపురాన్ అనే సినిమాలో నటిస్తున్నారు. మరోవైపు మోహన్ లాల్ వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ (Viral respiratory infection)తో బాధపడుతున్నట్లు వార్తలు రావడంతో అభిమానులు (Fans) ఆందోళనకు గురవుతున్నారని తెలుస్తోంది.