కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (CM Siddaramaiah) కు స్వల్ప ఊరట లభించింది. మైసూర్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (ముడా) కేసులో సిద్ధరామయ్యను విచారించాలంటూ గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ (Governor Dhavar Chand Gehlot) ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.
గవర్నర్ ఆదేశాల (Governor Orders) నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య కర్ణాటక హైకోర్టు (Karnataka High Court)ను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సిద్ధరామయ్యపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది. అయితే అప్పటివరకు కోర్డు ఆర్డర్స్ (Court Orders) అమలులో ఉంటాయని పేర్కొంది. కాగా సిద్ధరామయ్య సతీమణి పార్వతమ్మ పేరిట ఉన్న భూములను గతంలో అభివృద్ధి పనుల కోసం ముడా సేకరించిందని, అందుకు గానూ ఖరీదైన స్థలాలను సిద్ధరామయ్య కుటుంబం దక్కించుకుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.
మరోవైపు తన జీవితం తెరిచిన పుస్తకమని సీఎం సిద్ధరామయ్య అన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు. ఇన్నేళ్ల తన రాజకీయ జీవితం (Political Career) లో ఎటువంటి మచ్చ లేదని తెలిపారు. రాజ్ భవన్, బీజేపీ కావాలనే తనపై కుట్రలు పన్నుతున్నాయన్నారు. గవర్నర్ ఆదేశాల వెనుక కూడా రాజకీయ ప్రోద్బలం ఉందని ఆయన ఆరోపించారు.