Visakha Honey Trap Case: పెళ్లైన మగాళ్లే టార్గెట్.. అమాయకపు మాటలతో జ్యూస్ ఇస్తుంది… తాగారంటే ఇక అంతే …

విశాఖపట్నం: జాయ్ జమీమా…చూడటానికి అందంగా ఉంటుంది (Joy Jemima).. ముందు పరిచయం చేసుకొని.. ఆ తర్వాత అసలు సీన్ మొదలుపెడుతుంది.. ఇలా క్లోజ్ గా  మూవ్ అయి.. ట్రాప్ లో పడేస్తుంది. చివరకు మత్తు మందు కలిపి ప్రైవేట్ గా ఉన్న ఫొటోలు, వీడియోలు తీసుకుని బెదిరిస్తుంది. ఈమె ఉచ్చులో పడిన పెళ్లైన మగాళ్లు.. లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

హనీ ట్రాప్ లేడీ జాయ్ జెమిమా మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తీయటి మాటలు, తన అంద చందాలతో మగవాళ్లను ఎట్రాక్ట్ చేస్తుంది.. సమాజంలో పలుకుబడి డబ్బున్న  వ్యక్తులే టార్గెట్ గా చేసుకొని.. ట్రాప్ చేసి.. మత్తుమందు ప్రయోగించి.. చనువుగా ఉన్న ఫోటోలో వీడియో తీసి.. బ్లాక్ మెయిల్ చేస్తుంది ఈ జాయ్ జమీమా.. ఆమె ట్రాప్ లో పడిన మరో బాధితుడు ఆమె బెదిరింపులకు విలవిలలాడిపోయాడు. ఇప్పటికే ఎన్నారై యువకుడు సహా ఇద్దరు పోలీసులను ఆశ్రయించగా, తాజాగా పోలీసుల ముందుకు హైదరాబాద్ కు చెందిన మరొక వ్యక్తి  తన గోడును వెళ్లగక్కాడు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు.  దీంతో విశాఖ పోలీసులు మరో కేసు నమోదు చేశారు.  జాయ్ జమీమా మోసాలపై దీంతో మూడు కేసులు నమోదయినట్లు.