తిరుమల: తిరుమలలో ఇటీవల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. రేపు (గురువారం, అక్టోబర్17న) పౌర్ణమి సందర్భంగా నెలవారీ గరుడసేవ జరగనుంది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామి గరుడ వాహనంపై మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.