ఏపీ హైకోర్టు (AP High Court) లో వైసీపీ నేతలకు చుక్కెదురైంది. ఈ మేరకు వైసీపీ నాయకుల బెయిల్ పిటిషన్ల (Bail Petitions) ను న్యాయస్థానం తిరస్కరించింది.
టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ బెయిల్ పిటిషన్ ను రద్దు చేసిన హైకోర్టు (High Court) టీడీపీ కార్యాలయం (TDP Office) పై దాడి కేసులో నందిగం సురేశ్, తలశిల రఘురాం, దేవినేని అవినాశ్, అప్పరెడ్డితో పాటు ఇతర నేతల పిటిషన్లను కొట్టివేసింది. అయితే హైకోర్టు పిటిషన్లను కొట్టివేసిన నేపథ్యంలో వైసీపీ నేతలు సుప్రీంకోర్టు (Supreme Court) ను ఆశ్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది.