ప్రముఖ తమిళ నిర్మాత (Tamil Producer) మరియు నటుడు మోహన్ నటరాజన్ (Mohan Natarajan) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నై (Chennai) లో తుదిశ్వాస విడిచారని తెలుస్తోంది.
మోహన్ నటరాజన్ భౌతికకాయానికి మధ్యాహ్నం 3 గంటల తరువాత చెన్నైలోని తిరువొత్తియూర్ (Thirivoththioor) లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా మోహన్ నటరాజన్ నిర్మాత తరంగై వి షణ్ముగంతో కలిసి నిర్మాతగా పరిచయం అయ్యారు. ఆయన కన్నుక్కుల్ నిలవు, ఆళ్వార్, దైవ తిరుమగల్ మరియు వేల్ వంటి చిత్రాల (Movies) ను నిర్మించారు.